తిరుపతిలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ కి ఘన స్వాగతం పలికిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్.


తిరుపతిలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ కి ఘన స్వాగతం పలికిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్. 


మూడు రోజుల తిరుమల, తిరుపతి పర్యటన నిమిత్తం బుధవారం తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి వచ్చిన  గౌరవ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు  నిర్మలా సీతారామన్ ని  రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు  పయ్యావుల కేశవ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. 

ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, టి.టి.డి బోర్డు మెంబెర్ భానుప్రకాష్, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట రెవిన్యూ డివిజనల్ అధికారులు భానుప్రకాశ్ రెడ్డి, కిరణ్మయి, డిఎస్పి  తదితరులు పాల్గొన్నారు.


 

Post a Comment

Previous Post Next Post