చివరి రైతు వరకు ఎరువులు అందాలి - కలెక్టర్ వెట్రిసెల్వి .


చివరి రైతు వరకు ఎరువులు అందాలి - కలెక్టర్ వెట్రిసెల్వి .


ఎరువుల నిల్వలు తక్కువగా ఉన్న సొసైటీలకు ఎరువులు అందేలా చూడాలి.

ఎరువుల పంపిణీలో ఎక్కడా సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలి.

అంతర జిల్లా, రాష్ట్ర సరిహద్దుల వద్ద పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలి.

జిల్లాలో ఎరువుల సరఫరా, పంపిణీలపై వ్యవయసాయాధికారులతో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి జూమ్ కాన్ఫరెన్స్.

       ఏలూరు, సెప్టెంబర్, 11 :  జిల్లాలో చివరి రైతు వరకు  ఎరువుల పంపిణీ సక్రమంగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వ్యవసాయాధికారులు ఆదేశించారు.   స్థానిక కలెక్టరేట్ నుండి గురువారం సాయంత్రం జిల్లాలో ఎరువుల సరఫరా, పంపిణీ పై వ్యవసాయాధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ  జిల్లాలో ఇప్పటివరకు 78 వేల  624 మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా చేయడం జరిగిందన్నారు. ఈ నెల 12వ తేదీన సుమారు 600 మెట్రిక్ టన్నుల  యూరియా అదనంగా జిల్లాకు రానున్నదన్నారు. ప్రస్తుతం జిల్లాలో 2063 మెట్రిక్ టన్నుల యూరియా, 2897 మెట్రిక్ టన్నుల  డి. ఏ .పి .,  4315 మెట్రిక్ టన్నుల ఎం ఓ పి ., 12 వేల  831 మెట్రిక్ టన్నుల ఎన్ .పి .కె. , 662 మెట్రిక్ టన్నుల ఎస్ ఎస్ పి . మొత్తం కలిపి  27 వేల 6656 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు.  ఎరువుల పంపిణీలో ఎటువంటి సమస్య కలగకుండా చూడాలని, ఎరువుల నిల్వలు తక్కువగా ఉన్న సొసైటీలకు ఎరువులను వెంటనే సరఫరా చేయాలన్నారు. రాబోయే వారానికి అవసరమైన ఎరువుల అవసరాలను శుక్రవారం సాయంత్రానికి  తెలియజేయాలన్నారు.  అత్యవసరంగా ఎరువులు అవసరమైతే సంబంధిత వివరాలు వ్యవసాయ శాఖ టెక్నికల్ అసిస్టెంట్ వారికి తెలియజేసి పొందాలన్నారు.   పంటలవారీగా ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహణలో రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానంలో ఉండడం అభినందనీయమని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కలెక్టర్ సూచించారు. . జిల్లాలోని అంతర జిల్లా, రాష్ట్ర సరిహద్దుల వద్ద పటిష్టమైన నిఘా ఏర్పాటుచేయాలన్నారు.   యూరియా విషయంలో జిల్లానుండి ఇతర ప్రాంతాలకు  దారిమళ్లిందని,  దుర్వినియోగం జరిగిందనే మాట వినపడకుండా వ్యవసాయాధికారులు బాగా పనిచేశారని మంచి తెచ్చుకోవాలన్నారు. 

 

Post a Comment

Previous Post Next Post