మద్యం మత్తు లో...కానిస్టేబుల్‌పై యువకుల దాడి..


మద్యం మత్తు లో...కానిస్టేబుల్‌పై యువకుల దాడి..

     తూర్పు గోదావరి జిల్లా :-
రాజమండ్రిలో కొందరు యువకులు రెచ్చిపోయారు.

 ఓ పోలీసుపై దాడి చేశారు. 

కోటిపల్లి బస్టాండ్ వెనుక కొందరు యువకులు బహిరంగంగా మద్యం ,గంజాయి సేవించడంతో కానిస్టేబుల్ నాగబాబు అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు.

 కానీ ఓ యువకుడు బీర్ బాటిల్‌తో తనను తాను కొట్టుకుని, అనంతరం కానిస్టేబుల్‌పై దాడి చేశాడు. 

దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలయింది. 

ఈ ఘటనపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Post a Comment

Previous Post Next Post