ఏలూరు దక్షిణపు వీధి, ప్రశాంత్ నగర్ లో శ్రీ దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం.







 ఏలూరు దక్షిణపు వీధి, ప్రశాంత్ నగర్ లో శ్రీ దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం.

ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు గారు, జనసేన నాయకులు నారా శేషు. 

సెప్టెంబర్ 30:- ఏలూరులో శ్రీ దేవీ శరన్నవరాత్రుల మహోత్సవములు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రుల మహోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం దక్షిణపు వీధి ప్రశాంత్ నగర్ లో వేంచేసియున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో వద్ద సౌథెర్న్ స్టార్స్ మరియు వల్లూరు రమేష్ గారి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు గారు, జనసేన నాయకులు నారా శేషు గారు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నసమారాధన కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ దేవీ నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. అన్నిదానాల్లో అన్నదానం మిన్న అని అన్నారు. ఆ అమ్మవారి కరుణ కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న వల్లూరు రమేష్ గార్కి కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు నగిరెడ్డి కాశీ నరేష్, కూని శెట్టి మురళి కృష్ణ, బోండా రాము నాయుడు, భాస్కర్ కమిటీ సభ్యులు పుప్పాల సంతోష్, గంజి అప్పారావు, మామిడి ప్రసాద్, సేనాపతి ఈశ్వర్ రావు భారీ సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు..







Post a Comment

Previous Post Next Post