కైకలూరు దానగూడెం దళితులు సమస్య పై ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేయాలి - ఏలూరు దళిత,బహుజన,ప్రజా సంఘాలు.


 

కైకలూరు దానగూడెం దళితులు సమస్య పై ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేయాలి - ఏలూరు దళిత,బహుజన,ప్రజా సంఘాలు.

ఘటన జరిగిన పూర్తి విషయాలు సాక్ష్యలు వీడియోలుతో సహా వివరించిన ఏలూరు డి.ఎస్.పి శ్రావణ్.

దోషులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్న డి.ఎస్.పి శ్రావణ్.

ఏలూరు జిల్లా...

స్థానిక ఏలూరు డి.ఎస్.పి కార్యాలయంలో ఏలూరు డీఎస్పీ శ్రావణ్ ని కలిసిన ఏలూరు దళిత బహుజన,ప్రజాసంఘ నాయకులు, కైకలూరు నియోజకవర్గం దానగూడెం లో దళితులపై జరిగిన దాడిపట్ల ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేయాలని  కోరారు, దానికి డిఎస్పి శ్రావణ్  స్పందిస్తూ ఆ కేసు విషయంలో ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, ఈరోజు కూడా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపామని,కైకలూరు దానగూడెంలో జరిగిన పూర్తి విషయాలను వివరించారు,కేసు విషయంలో అపోహలు వద్దని,దోషులు ఎంతటి వారైనా విడిచి పెట్టేది లేదని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు డాక్టర్ మెండెం సంతోష్ కుమార్,మత్తే బాబి, కాపుదాసి రవికుమార్,ఎరికిపాటి విజయ్, సొంగ మధు,పల్లా యేసేబు,కనికెళ్లి మురళీకృష్ణ,పల్లి విజయ్,దయాకర్, సందీప్,తదితర నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post