చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డీఎస్సీ ఉద్యోగం సాధించిన విద్యార్థులను అభినంధించిన - ఏలూరు ఏం ఎల్ ఏ బడేటి రాధా కృష్ణయ్య.
ఏలూరు జిల్లా...చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డీఎస్సీ ఉద్యోగం సాధించిన విద్యార్థులకు సి ఆర్ రెడ్డి కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన అభినందన సభ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హాజరయ్యారు.....
ఈ కార్యక్రమంలో బడేటి చంటి మాట్లాడుతూ దృడ సంకల్పంతో చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చింతమనేని ప్రభాకర్ ఇంతటి గొప్ప కార్యక్రమం చేయడం అభినందనీయమని అన్నారు.....ఉద్యోగం సాధించిన 38 మంది విద్యార్థులునీ అభినందించారు....ఈ కార్యక్రమంలో ఎంపీ పుట్ట మహేష్ కుమార్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, డిఎస్పి శ్రావణ్ కుమార్, ఏలూరు ఏఎంసి చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి, దెందులూరు ఏఎంసీ చైర్మన్ రామ సీత తదితరులు పాల్గొన్నారు.

