జిల్లాలో సుమోటో క్యాస్ట్ వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలనీ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.
ఏలూరు, సెప్టెంబర్, 19 : జిల్లాలో సుమోటో క్యాస్ట్ వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రెవిన్యూ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి శుక్రవారం సాయంత్రం సుమోటో క్యాస్ట్ వెరిఫికేషన్, ఇళ్ల స్థలాల కొరకు అందిన దరఖాస్తులు, రైస్ కార్డుల పంపిణీ, తదితర అంశాలపై డివిజినల్, మండల స్థాయి రెవిన్యూ అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ సుమోటో క్యాస్ట్ వెరిఫికేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇళ్ల స్థలాల కోసం నిరుపేదల నుండి అందిన దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాను రూపొందించాలన్నారు. డిజిటల్ రైస్ కార్డుల పంపిణీ ని వేగవంతం చేయాలనీ, ఈ-పంట నమోదును నూరుశాతం పూర్తిచేయాలన్నారు.
డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఆర్డీఓలు అచ్యుత్ అంబరీష్, రమణ, తహసీల్దార్లు, ప్రభృతులు పాల్గొన్నారు.
