మహిళను హింసించిన కేసులో నలుగురు అరెస్ట్.


 

మహిళను హింసించిన కేసులో నలుగురు అరెస్ట్. 


(ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు )

ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని కలుజువ్వలపాడు గ్రామంలో భాగ్యలక్ష్మిని ఆమె భర్త బాలాజీ హింసించిన ఘటనలో శుక్రవారం పోలీసులు భర్త బాలాజీ తో పాటు అతనికి సహకరించిన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పొదిలి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా కోర్టు వారికి 14 రోజులు రిమాండ్ విధించిందని సిఐ అన్నారు. మద్యానికి బానిసైనా బాలాజీ వేరొక స్త్రీతో సన్నిహిత సంబంధాలు పెట్టుకొని భార్యను డబ్బు కోసం వేధించేవాడని సీఐ విలేకర్ల సమావేశంలో వివరాలు తెలిపారు.

Post a Comment

Previous Post Next Post