పదోన్నతి పొందిన ఆర్‌విఎస్‌ రామచంద్రరావు. ఏపీయూడబ్ల్యూజే చిరు సత్కారం.




 

పదోన్నతి పొందిన ఆర్‌విఎస్‌ రామచంద్రరావు.

ఏపీయూడబ్ల్యూజే చిరు సత్కారం.


ఏలూరు : ఏలూరు జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి (డీపీఆర్వో) ఆర్‌విఎస్‌ రామచంద్రరావు పదోన్నతిపై రాజమండ్రిలో స్టేట్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (పూర్తి అదనపు బాధ్యతలు)గా బదలీ అయ్యారు. ఆయన బుధవారం రాజమండ్రిలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆర్వీఎస్‌ను బదలీ చేస్తూ సమాచార శాఖ కమిషనర్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.1987లో పబ్లిక్‌ సర్వీస్‌కమిషన్‌ డైరెక్ట్‌ రిక్రూటీగా సమాచార శాఖలో చేరిన రామచంద్రరావు సీనియర్‌ అసిస్టెంట్‌గా రాజమండ్రి, కాకినాడల్లో పనిచేశారు. 2000 సంవత్సరంలో ఎపీఆర్‌ఓగా పదోన్నతిపై ఏలూరుకు బదలీపై వచ్చారు. ఆ తర్వాత పదోన్నతిపై ఏలూరు , విజయవాడల్లో డివిజనల్‌ పీఆర్‌ఓ గా చేశారు. ఇన్‌ఛార్జ్‌ డీపీఆర్‌ఓగా ఏలూరులో పనిచేసిన రామచంద్రరావు ఆ తర్వాత పూర్తిస్థాయి డీపీఆర్వోగా పదోన్నతి పొందారు. ఆయన ఐదు సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించి ప్రశంసలు పొందారు. డీపీఆర్ఓగా గోదావరి, కృష్ణా పుష్కరాల సమయంలో విధులు నిర్వహించి ఉత్తమ అధికారిగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు. పోలవరం ప్రాజక్టు నిర్మాణ పనుల సమాచారాన్ని పత్రికలకు అందచేయడంలో ఆయన విశేషంగా కృషి చేశారు. తాజాగా అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా రాజమండ్రి ఎస్‌ఐసికి బదలీ అయ్యారు. 


*ఆర్‌విఎస్‌ రామచంద్రరావు కు ఏపీయూడబ్ల్యూజే చిరు సత్కారం....* 


 ఏలూరు జిల్లాలో గత 25 సంవత్సరాలుగా ఎపీఆర్‌ఓగా, డివిజనల్‌ పీఆర్‌ఓ గా, ఇన్‌ఛార్జ్‌ డీపీఆర్‌ఓగా, డీపీఆర్వోగా విశేష సేవలను అందించిన ఆర్‌విఎస్‌ రామచంద్రరావు ను ఏపీయూడబ్ల్యూజే నాయకులు సోమవారం రాత్రి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ఉపాద్యక్షులు కె మాణిక్యరావు మాట్లాడుతూ గోదావరి, కృష్ణా పుష్కరాల సమయంలో, విపత్తులు, వరదల సమయంలో, రాష్ట్రంలో నిర్వహించిన జాతీయ పోటీలు తదితర కార్యక్రమాల్లో విశేష సేవలందించిన ఆర్‌విఎస్‌ రామచంద్రరావు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా రాజమండ్రిలో మరిన్ని సేవలందించాలని ఆకాంక్షించారు. ఆయన పదవికాలంలోనే అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నుంచి జాయింట్ డైరెక్టర్ గా ఉన్నత పదవిని పొందాలన్నారు. జిల్లా అధ్యక్షులు కె.పి.కె కిషోర్, ఐజెయూ నాయకులు జివిఎస్ఎన్ రాజు, యూనియన్ సీనియర్ నాయకులు జి. రఘురామ్, సమాచార శాఖ ఏలూరు జిల్లా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సురేంద్ర లు మాట్లాడుతూ విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ ప్రభుత్వం నుండి ఉత్తమ సేవకు పతకాలు సాధించారని ప్రశంసించారు. పదోన్నతిపై ఎడిగా వెళ్తున్న రామచంద్రరావు పౌర సంబంధాల శాఖకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. పలువురు ఏలూరు జర్నలిస్టులు ఆర్వీఎస్‌ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఆర్‌విఎస్‌ రామచంద్రరావు ను ఘనంగా సత్కరించి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కార్యవర్గ సభ్యులు, సమాచార కార్యాలయ ఉద్యోగులు పాల్గున్నారు.

Post a Comment

Previous Post Next Post