వికలాంగుల డిమాండ్స్ వెంటనే నెరవేర్చాలి - బి.సోమయ్య, ఏలూరు.


వికలాంగుల డిమాండ్స్ వెంటనే నెరవేర్చాలి - బి.సోమయ్య, ఏలూరు.
 

 ఏలూరు, సెప్టెంబర్, 15:

వికలాంగులందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని, తొలగించిన వికలాంగుల పెన్షన్లు పునరుద్ధరించాలని, ఇండ్లు లేని వికలాంగులందరికీ ఇంటి స్థలం ఇచ్చి ఇండ్ల నిర్మాణం చేయాలని వికలాంగుల సేవా సంఘం జిల్లా సమావేశం ప్రభుత్వాన్ని కోరింది. వికలాంగుల సేవా సంఘం జిల్లా సమావేశం స్థానిక ఆర్ఆర్ పేటలోని శ్రీ కాశీ విశ్వేశ్వర కళ్యాణ మండపం నందు ఆదివారం సాయంత్రం జరిగింది. 

ఈ సమావేశానికి కుందేటి జయరాజు అధ్యక్షత వహించి మాట్లాడారు. వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, వికలాంగులందరికీ స్వయం ఉపాధి చేసుకునేలా లోన్లు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కేంద్రం ఏలూరులో ప్రభుత్వం వికలాంగులకు కమ్యూనిటీ హాలు, సమావేశ మందిరం ఏర్పాటు చేయాలని జిల్లా సమావేశం ఒక తీర్మానంలో కోరింది. ఈ సమావేశంలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎల్. రాంబాబు,బెంజిమెన్,పి. రాంబాబు,బి.శివరామకృష్ణ, పళ్లెం వెంకటేశ్వరరావు, పి. చంద్రవాణి, డి.గంగాధర్, ధనలక్ష్మి జి. రవిచంద్ర, కే.సురేష్, ఏ.తాతారావు, రామాంజనేయులు, తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు బి.సోమయ్య మాట్లాడుతూ వికలాంగుల హక్కుల చట్టం 2016 రాష్ట్రంలో అమలు జరపాలని, వికలాంగులకు బడ్జెట్లో 5 శాతం నిధులు కేటాయించాలని తద్వారా మాత్రమే వికలాంగులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. వికలాంగుల హక్కుల చట్టం కోసం రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టవలసిన అవసరం ఉందని ఆయన తెలిపారు. అనంతరం సమావేశం క్రింది వారితో వికలాంగుల సేవా సంఘం జిల్లా కమిటీని ఎన్నుకున్నది.

గౌరవ అధ్యక్షులు- బి.సోమయ్య, అధ్యక్షులు-కుందేటి జయరాజు, ఉపాధ్యక్షులు- డి.గంగాధర్ రావు, సిహెచ్.కృష్ణమూర్తి,

 ప్రధాన కార్యదర్శి ఎల్.రాంబాబు,

సహయ దర్శులు పల్లెం వెంకటేశ్వరరావు, కాటూరి సత్యనారాయణ, 

మహిళా విభాగం అధ్యక్షురాలు- పి.చంద్రవాణి, 

కమిటీ సభ్యులు ధనలక్ష్మి,రవిచంద్ర,సురేషు, తాతారావు,రామాంజనేయులు, న్యాయ సలహాదారు,పి.రాంబాబు లతో నూతన కమిటీని ఎన్నుకున్నది. 

Post a Comment

Previous Post Next Post