ముత్తుమళ్ళకు ఘన సన్మానం.
(ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు)
ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కంభం మండలానికి చెందిన. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి. మరియు ఆంధ్రప్రదేశ్ విద్యా మరియు సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన సందర్భంగా డైనమిక్ గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డిని గోన చెన్నకేశవులు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు రాష్ట్రస్థాయిలో ఆంధ్రప్రదేశ్ విద్యా మరియు సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించబడ్డ గోన చెన్నకేశవులు ఎంతో మంచి మనసుతో పార్టీకి తన కర్తవ్యంతో ప్రజలకు మంచి పనులు చేసి ఎస్సీల సమస్యలపై ఎంతో కృషి చేశారని ఆ కృషి ఫలితమే ఈరోజు డైరెక్టర్గా ఇవ్వటం జరిగిందని. చెన్నకేశవులకు అభినందనలు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ విద్య మరియు సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ గోన చెన్నకేశవులు మాట్లాడుతూ ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి మా ప్రియతమా నియోజకవర్గ శాసనసభ్యులైనా గౌరవ శ్రీ ముత్తుమల్ల అశోక్ రెడ్డి గారి ఆశీర్వాదం వలన నేను ఈరోజు డైరెక్టర్గా నియమితులైనందుకు ఆయనకు రుణపడి ఉంటానని కృతజ్ఞతలు తెలియజేశారు.అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి ప్రజలకు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులకు.కార్యకర్తలకు కూటమి నాయకులకు కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని సన్మాన కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గిద్దలూరు మండల అధ్యక్షులు. మార్తాల సుబ్బారెడ్డి. కొమరోలు మండల అధ్యక్షులు. బోనేని వెంకటేశ్వర్లు. కంభం మండల సొసైటీ చైర్మన్ కేతన్ శ్రీనివాస్. టిడిపి నాయకుడు కొత్తపల్లి శ్రీను. తురిమిళ్ళ మాజీ సర్పంచ్ నారిశెట్టి వీరమ్మ. జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి. యమ సంజయ్. గిద్దలూరు కౌన్సిలర్ లోక్కు రమేష్. నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు గుర్రం డానియల్. జిల్లా ఎస్సీ మానిటరింగ్ కమిటీ నాయకులు గూడూరి అన్నోజి రావు. కంభం మండల ఎస్సీ సెల్ నాయకులు సిరివెళ్ల రవికుమార్. బహుజన పరిరక్షణ సమితి నాయకులు దాసరియోబు.బిజెపి కంభం మండల నాయకులు బాదం కిషోర్. కోలా ప్రసన్న. ముస్లిం మైనార్టీ నాయకుడు రజాక్ బాషా. జిలాని. రహిమాన్. బీసీ సెల్ అధ్యక్షులు బొంతలపాటి రమణ. కంభం టౌన్ అధ్యక్షుడు మాధవ. కంభం మండల ప్రధాన కార్యదర్శి ఆరేపల్లి మల్లికార్జున్. కటికల భాస్కరు. ఆర్య బ్రహ్మయ్య. దున్న యోబు. ఎన్టీఆర్ గౌస్. హర్షద్. గౌస్. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల నాయకులు కార్యకర్తలు దళిత నాయకులు బహుజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

