గౌరవెల్లి ప్రాజెక్టును సందర్శించిన బి ఆర్ ఎస్ నాయకులు.



గౌరవెల్లి ప్రాజెక్టును సందర్శించిన బి ఆర్ ఎస్ నాయకులు.

TELANGANA సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టును బిఆర్ఎస్ నాయకులు సందర్శించారు. కాంగ్రెస్ పార్టీ కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసిఆర్ పై అపనిందలు వేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. గౌరవెల్లి ప్రాజెక్టు నీటితో జనగాంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి జలాభిషేకం చేశారు. కేసిఆర్ కట్టించిన ప్రాజెక్టుల వల్లనే బీడు భూములతో ఉన్న తెలంగాణ నేడు సస్యశ్యామలం అయిందని బిఆర్ఎస్ నాయకులు అన్నారు. పరిపాలన చేతకాక కేసీఆర్ పై అపనిందలు వేస్తూ ప్రజలను మభ్యపెట్టి గందరగోళానికి గురిచేయాలని కాంగ్రెస్ నాయకులు చూస్తున్నారని ఆరోపించారు. కాలేశ్వరం ప్రాజెక్టు నుండి గౌరవెల్లి ప్రాజెక్టు లోకి వచ్చిన నీటితో తెలంగాణ తల్లికి జలాభిషేకం చేశామన్నారు.

Post a Comment

Previous Post Next Post