మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలి. కలెక్టర్.


మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలి. కలెక్టర్. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

              జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేయడంతో పాటు భూగర్భ జల స్థాయి పెరిగేలా చెక్ డ్యామ్స్, ఇంకుడు గుంతల నిర్మాణాలు, చెరువులు, ఫీడర్ చానల్స్ పూడిక తీత పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు,డ్వామా అధికారులను ఆదేశించారు. 

మంగళవారం ఉదయం ఒంగోలు కలెక్టరేట్లోని తన చాంబర్ లో జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, డ్వామా అధికారులతో సమావేశమై జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అమలు జరుగుచున్న ఫారం ఫాండ్స్, ఇంకుడు గుంతల నిర్మాణాలు, ఫీడర్ ఛానల్స్ మరియు సప్లై ఛానల్స్ పూడికతీత పనులు, అమృత్ సరోవర్ పనులు, రోడ్డు ఫార్మేషన్, హార్టికల్చర్, ట్రెంచ్ వర్క్స్, బౌండరీస్, తదితర పనులకు సంబంధించిన అంశాలపై క్లస్టర్ల వారీగా సమీక్షించారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా అమలు జరుగుచున్న వివిధ కార్యక్రమాల నిర్దేశిత లక్ష్యాలను, సాధించిన పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డ్వామా పిడి శ్రీ జోసెఫ్ కుమార్, జిల్లా కలెక్టర్ కు వివరించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని, అందులో భాగంగా వాటర్ షేడ్స్, క్యాటిల్ షేడ్స్ నిర్మాణాలు తదితర పనులకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. ప్రకాశం జిల్లా నీటి ఎద్దడి వున్న జిల్లా కాబట్టి ఈ విషయాన్ని ప్రధానంగా తీసుకొని భూగర్భ జల స్థాయి పెరిగేలా చెక్ డ్యామ్స్, ఇంకుడు గుంతల నిర్మాణాలు, చెరువులు, ఫీడర్ చానల్స్ పూడిక తీత పనులపై క్లస్టర్స్ వారీగా ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు హార్టికల్చర్ ప్లానిటేషన్ ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో ఒక కోటి 11 లక్షల పనిదినాలు కల్పన లక్ష్యం కాగా, ఇప్పటి వరకు ఒక కోటి 1 లక్ష పనిదినాలు కల్పించడం జరిగింది, మిగిలిన పనిదినాల లక్ష్య సాధనకు అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్లస్టర్ల వారీగా చేపట్టే పనులలో లేబర్ మొబిలైజేషన్ ఎక్కువగా ఉండేందుకు తగు ప్రణాళికను సిద్దం చేసుకొని అందు కనుగుణంగా అందరూ సమన్వయం చేసుకొని క్షేత్రస్థాయి వరకు పనిచేయాలన్నారు. ఉపాధి హామీ పథకం యొక్క నియమ నిబంధనలను తప్పక పాటిస్తూ నిర్దేశించిన లక్ష్యాల సాధనకు కృషి చేయాలన్నారు. జిల్లాలో భూగర్భ జల స్థాయి పెరిగేలా ఉపాధి హామీ పధకం కింద చేపట్టే పనులు ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచేలా అధికారులు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. 

ఈ సమావేశంలో డ్వామా పిడి శ్రీ జోసెఫ్ కుమార్, డ్వామా సిబ్బంది పాల్గొన్నారు.

Add



 

Post a Comment

Previous Post Next Post