సత్యసాయి దేవాలయములో రక్తదానం శిబిరం ఏర్పాటు.
( ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి. దాసరి యోబు )
ప్రకాశం జిల్లా కంభం మండల కేంద్రంలోని శ్రీ సత్య సాయి దేవాలయంలో సత్యసాయి సేవాసమితి జిల్లా అధ్యక్షులు టి రామిరెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమం సత్య సాయి దేవాలయ కన్వీనర్ కృష్ణమోహన్ అధ్యక్షతన జరిగింది.
ఈ రక్తదాన శిబిరంలో సాయి సేవా సమితి సభ్యులు 45 మంది రక్తదానం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా టి రాంరెడ్డి మాట్లాడుతూ. అన్ని దానాల కన్నా రక్త దానం గొప్పదని ఈ రక్త దానం వలన తల సేమియా తో బాధపడుతున్న చిన్నారులకు. గర్భిణీ స్త్రీలకు మరియు వివిధ అనారోగ్య కారణాలకు గురైన వారికి రక్త దానం ద్వారా ప్రాణాలు కాపాడిన వారమైతామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.
రక్తదానం చేసిన సాయి సేవా సమితి వారిని పలువురు అభినందనలు తెలియజేశారు.
.jpeg)

