కంభంలో భారీ వర్షాల ప్రభావంతో యశస్విణి వైద్యశాల సమీపములో నీటమునిగిన ఇరిగేషన్ కాలువలు నిద్రమత్తులో అధికారులు.




 కంభంలో భారీ వర్షాల ప్రభావంతో యశస్విణి వైద్యశాల సమీపములో నీటమునిగిన ఇరిగేషన్ కాలువలు నిద్రమత్తులో అధికారులు. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో నిన్నటి నుండి కురుస్తున్న వర్షాల కారణంగా యశస్విణి హాస్పిటల్ సమీపంలో కాల్వలు నీటితో నిండిపోయి ప్రజలకు అంతరాయం కలిగిస్తూ న్నాయి. అయితే కాలువలో మురుగు నీరు రోడ్డు మీదికి చేరి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఆ మురుగు నీటి వలన వచ్చే సీజనల్ వ్యాధులలో ప్రజలకు తీవ్రమైన వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రజలు మీడియాకు తెలియజేశారు.

స్థానిక ప్రజలు కలిసి కర్రల సహాయంతో కాలువల్లోని నీటిని వదిలేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

అయితే, ఆ ప్రాంతంలో ఉన్న విద్యు త్ పరివర్తకం సమీపంలో కూడా భారీగా నీరు చేరి ఉండటంతో ప్రమాద పరిస్థితి నెలకొంది. విద్యుత్ పరివర్తకము వద్ద నీరు నిల్వ ఉంటే విద్యుత్ సరఫరా అయ్యే ప్రమాదం ఉండటంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

కంభం పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల కొద్దిపాటి వర్షానికే రోడ్లు నీటమునిగిపోతున్నాయి. స్థాని ఇరిగేషన్ మరియు పంచాయితీ అధికారులు వెంటనే తగుచర్యలు తీసుకొని నీటి నిల్వ ఉన్న ప్రాంతాలను శుభ్రపరచాలని, ఇరిగేషన్ కాల్వ డ్రైనేజీ వ్యవస్థను సక్రమం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిస్థితి మరింత తీవ్రమవుతుందేమోనని ప్రజలు ఆందోళనకు గురైవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు డ్రైనేజీ కాలువలు.ఇరిగేషన్ కాలువను.పరిశీలించి చర్యలు తీసుకుందురని అలాగే మురుగు కాలువల అంటు వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ప్రజలు కోరుచున్నారు.

Add


Post a Comment

Previous Post Next Post