ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
జనవరి 1 నుండి మార్కాపురం జిల్లాలో పరిపాలన విభాగాలన్నీ ప్రారంభం.వెనుకబడిన గిద్దలూరుకు 2027 నాటికీ డివిజన్ హోదా
రాబోయే తరాలకు భవిష్యత్తును అందించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం.
మార్కాపురం జిల్లా సాధనలో గిద్దలూరు జేఏసీ నాయకుల కృషి అభినందనీయం.
2027 నాటికీ లక్ష ఇరవై వేల ఎకరాలకు వెలుగొండ జలాలు అందించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం.
గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ.
పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజల దశాబ్దాల కాలం నాటి చిరకాల స్వప్నం మార్కాపురం జిల్లా అని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి పేర్కొన్నారు.
మార్కాపురం జిల్లాను ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి.కొణిదెల పవన్ కళ్యాణ్ గార్లకు నియోజకవర్గ ప్రజల తరుపున ప్రత్యేక ధన్యవాదములు తెలియచేస్తూ గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముళ్ళ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు..
ఈ ర్యాలీలో పాఠశాల విద్యార్థులు వేలాదిమంది పాల్గోన్నారు. థాంక్యూ సీఎం సార్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ హోరెత్తింది. ర్యాలీ అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్ర పటాలకు ఎమ్మెల్యే పాలభిషేకం చేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలోభాగంగామార్కాపురం జిల్లా గా ప్రకటిస్తానని సీఎం చంద్రబాబు గారు హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారమే నేడు జిల్లాను ప్రకటించటం కూటమి ప్రభుత్వ విశ్వసనీయతకు నిదర్శనమన్నారు. డిసెంబర్ 30 నాటికీ అధికార యంత్రాంగం మార్కాపురం జిల్లాకు మార్పు చేసి, జనవరి 1 నుండి నూతన జిల్లా నుండే పరిపాలన కొనసాగుతుందన్నారు.
పశ్చిమ ప్రాంత అభివృద్దే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, 2027 నాటికీ వెలుగొండ ప్రాజెక్ట్ ద్వారా లక్ష 20 వేల ఎకరాలకు సాగునీరు అందించటమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు..
వెనుకబడిన గిద్దలూరును కూడా 2027 నాటికీ డివిజన్ చేస్తానని సీఎం హామీ ఇచ్చారన్నారు. రాబోయే భావితరాలకు భవిష్యత్తును అందించటమే లక్ష్యంగా తమ పాలన కొనసాగుతుందని,
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో విద్యారంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టి విద్యార్థుల భవితకు కృషి చేస్తున్నారన్నారు..
మార్కాపురం జిల్లా సాధనలో గిద్దలూరు జేఏసీ నాయకుల కృషి అభినందనీయమని గతంలో వారు 51 రోజుల పాటు జిల్లా సాధన కోసం అహర్నిశలు పోరాటం చేశారన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కాపురం జిల్లా జేఏసీ నాయకులు, విద్యార్థులు, ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు, మాజీ సైనికులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు పాల్గోన్నారు.
