ఎ.సి.బి.కి చిక్కిన గ్రామ రెవిన్యూ అధికారి.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి. జిల్లారిపోర్టర్ (క్రైమ్).
పి. మహేశ్వరరావు.అనకాపల్లి నవంబర్:11
దేవరపల్లి మండలం, పెదనందిపల్లి గ్రామానికి చెందిన యస్. అమ్మతల్లినాయుడు బంధువులుకు చెందిన వ్యవసాయ భూమిని రెవిన్యూ రికార్డులలో మ్యుటేషన్ చేసి, ఈ-పాస్ బుక్ ఇచ్చినందుకు గాను అనకాపల్లి జిల్లా, దేవరపల్లి మండలం, యం. అలమంద గ్రామ సచివాలయంలో గ్రామ రెవిన్యూ అధికారిగా పనిచేయుచున్న చుక్క సూర్యనారాయణ సదరు యెస్. అమ్మతల్లి నాయుడు వద్దనుండి రూ. 20,000/-లంచంగా డిమాండు చేసినారు. అయితే సదరు యస్. అమ్మతల్లి నాయుడుకు ఆ లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టంలేక, సదరు గ్రామ రెవిన్యూ అధికారిపై విశాఖపట్నం ఎ.సి.బి అధికారులకు ఫిర్యాదు చేసినాడు. విశాఖపట్నం ఎ.సి.బి అధికారులు, అతని ఫిర్యాదును వారి ఆఫీసు క్రైం. నెం. 9/RCT-VSP/2025, అవినీతి నిరోధక (సవరణ) చట్టం- 2018 సెక్షన్ 7 క్రింద కేసుగా నమోదు చేసి, సదరు గ్రామ రెవిన్యూ అధికారి, ఆ లంచం డబ్బులను, ఫిర్యాదు దారుడి వద్దనుండి ఈ రోజు అనగా తేది. 11.11.2025 నాడు తీసుకొంటుండగా, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని, అరెస్టు చేసినారు.అరెస్టు కాబడిన సదరు అధికారిని విశాఖపట్నంలోని ఎ.సి.బి. ప్రత్యేక న్యాయస్థానంలో రేపు హాజరు పరచనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలో ఏదైనా అవినీతి జరుగుచున్నట్లయితే, సదరు సమాచారాన్ని ఎవరైనా సంభందిత జిల్లా ఎ.సి.బి అధికారులకు కాని లేదా ఎ.సి.బి. టోల్ ఫ్రీ నెంబరు 1064 లేదా ఎ.సి.బి మొబైల్ నెం. 94404 40057 .complaints-acb@ap.gov.in తెలియపరచవచ్చు.ప్రజా పౌర సంభందాల అధికారి, ప్రధాన కార్యాలయం, అవినీతి నిరోధక శాఖ, ఆంధ్రప్రదేశ్, విజయవాడ.
