ఏలూరు జ్యూట్ మిల్ సెంటర్లో ఐ.ఎఫ్.టి.యు.ఆధ్వర్యంలో ఆటో కార్మికుల నిరసన.


 




ఏలూరు జ్యూట్ మిల్ సెంటర్లో ఐ.ఎఫ్.టి.యు.ఆధ్వర్యంలో ఆటో కార్మికుల నిరసన.
     ఎన్నికలకు ముందు అధికారంలోకి రావటానికి కూటమి నాయకులు  ఆటో, మోటార్ కార్మికులకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని ఐ.ఎఫ్.టి.యు. రాష్ట్ర సహాయ కార్యదర్శి యు. వెంకటేశ్వరరావు(యు. వి), జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు లు డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత బస్సు వల్ల ఉపాధి కోల్పోతున్న ఆటో కార్మికులను ఆదుకోవాలని కోరుతూ ఈరోజు ఐ.ఎఫ్.టి.యు ఆధ్వర్యంలో స్థానిక జూట్ మిల్లు సెంటర్లో జరిగిన ఆటో కార్మికుల నిరసన కార్యక్రమం సందర్భంగా వారు ప్రసంగించారు. తాము అధికారంలోకి వస్తే మోటార్ కార్మికులపై పెనాల్టీలు విధించే జీవో నెంబర్ 21 రద్దు చేస్తామనీ, వాహన మిత్ర పదివేల నుంచి 15 వేలకు పెంచి అందరికీ ఇస్తామనీ, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని పలు రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులు ప్రస్తుతం ఆ హామీలను గాలికి వదిలేసారని వారు విమర్శించారు.  మహిళలకు ఉచిత బస్సు ఇవ్వటానికి తాము వ్యతిరేకం కాదనీ, కానీ దానివల్ల ఉపాధి కోల్పోతున్న ఆటో కార్మికులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని  విజ్ఞప్తి చేశారు.  అనంతపురం సభలో వాహన మిత్రను 10వేల నుంచి 15 వేలకు ముఖ్యమంత్రి ప్రకటించినప్పటికీ, వాహన మిత్ర అమలు చేసే కార్మికుల సంఖ్యను దారుణంగా తగ్గించేశారనీ, సొంత ఆటో డ్రైవర్లకు మాత్రమే ఇస్తానని చెప్పటం ద్వారా లక్షలాదిమంది కార్మికులకు వాహన మిత్ర సౌకర్యం అమలు జరపకుండా పోతుందని  ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల వాహన మిత్ర మొత్తం కార్మికులందరికీ వర్తింపజేయాలని   డిమాండ్ చేశారు. కూటమి నాయకులు ఇచ్చిన హామీ మేరకు ఇంధనం ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా  భవన నిర్మాణ కార్మికుల వలే ఆటో మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యల పరిష్కారానికి *సెప్టెంబర్ 18న  జరిగే ఛలో విజయవాడ* కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు.
 ఈ కార్యక్రమంలో ఏలూరు గూడ్స్ షెడ్  ఆటో కార్మిక సంఘం ప్రెసిడెంట్ పి. మహేష్, సెక్రటరీ కె.శివ, కమిటీ సభ్యులు బి.మురళి, ఆర్ పూర్ణ, ఎస్.శ్రీనివాస్, పి. వెంకటేష్, పి.పెద్దిరాజు, జి చిన్నా తదితరులు నాయకత్వం వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఆటో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Post a Comment

Previous Post Next Post