స్థానిక ఎన్నికలకు ముందు బీసీల వాటా ఎంత అదేవిధంగా బీసీల రక్షణ చట్టం అమలుపై NTR జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన - ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు.
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్ రావు గారి ఆదేశాలతో ఎన్టీఆర్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మేకా వెంకటేశ్వరరావు అధ్యక్షతన బీసీల యొక్క సమస్యలపై స్థానిక ఎలక్షన్స్ వెళ్లే ముందు స్థానిక సంస్థలలో బీసీల వాటా ఎంత అదేవిధంగా బీసీల రక్షణ చట్టం అమలుపై అదేవిధంగా కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ సభ ప్లాన్ పై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని అదే విధంగా జనగణతో
పాటే కుల గణన చేసి బీసీలు ఎంత శాతం ఉన్నారు ఆశాతం ప్రకారం మా వాటా ఎంత తేల్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో విజయవాడ నగర అధ్యక్షులు చిప్పాడ చందు, బీసీ ఉద్యోగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంవిఎస్ఎన్ మూర్తి గారు ఉద్యోగ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గుంటుపల్లి ఉమామహేశ్వర గారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏం కనకారావు గారు, ఎన్టీఆర్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు జానకిరామ్ ప్రసాద్ గారు, మరీదు రాంబాబు గారు కల్లుగీత కార్మిక శాఖ నాయకులు వాకా వెంకటేశ్వరావు గారు బీసీ నాయకులు పునుగుపాటి శ్రీనివాస్ గారు పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు


