విద్యార్థులు చదువుతో పాటు క్రీడాల్లోనూ రాణించాలి.




విద్యార్థులు చదువుతో పాటు క్రీడాల్లోనూ రాణించాలి.

( ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు )

 ప్రకాశం జిల్లా బేస్తవారిపేట : విద్యార్థులు చదువుతో పాటు క్రీడాల్లోనూ రాణించాలని, క్రీడలు మానసిక వికాసానికి, శారీరక దారుడ్యానికి దోహదపడతాయని ఎంఈఓలు ఎన్ మధుసూదనరెడ్డి, సీవీ రమణారెడ్డిలు పేర్కొన్నారు. స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మండల స్థాయి ఎస్ జీఎఫ్ క్రీడా పోటీలను గురువారం ప్రారంభించిన సందర్భంగా వారు మాట్లాడారు. క్రీడాకారులు గెలుపొటములను సమానంగా స్వీకరించాలన్నారు. మండల స్థాయిలో గెలుపొందిన విద్యార్థులను డివిజన్ స్థాయికి, డివిజన్ స్థాయిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను జిల్లా స్థాయి క్రీడలకు ఎంపిక చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ క్రీడా పోటీలకు మండల పరిధిలోని వివిధ పాఠశాలల నుండి 300 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటారు. బాలికల కబడ్డీ పోటీలో కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థినిలు సత్తా చాటగా, బాలుర విభాగంలో బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు, వాలీబాల్ పోటీలో పిటికాయగుల్ల విద్యార్థులు ప్రతిభను చాటారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం. శ్రీదేవి, పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పీడీలు పాల్గొన్నారు.
 

Post a Comment

Previous Post Next Post