విస్తృత వాహనాలు తనిఖీ చేసిన సీఐ బాబు.
సిద్ధవటం
కడప చెన్నై జాతీయ రహదారి భాకరాపేట తనిఖీ కేంద్రం సమీపాన సోమవారం సాయంత్రం ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ బాబు విస్తృత వాహనాలు తనిఖీ చేపట్టారు ఈ సందర్భంగా సీఐ, టీ బాబు సోమవారం మాట్లాడుతూ కడప ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు కడప డిఎస్పి వెంకటేశ్వర్లు సూచనల మేరకు కడప చెన్నై జాతీయ రహదారి భాకరాపేట ఫారెస్ట్ తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు తనిఖీలు చేపట్టగా ద్విచక్ర వాహదారుల పత్రాలు లేని పలు ద్విచక్ర వాహనదారులకు జరిమానా విధించి వాహనదారులకు పలు సూచనలను సలహాలు అందజేశారు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని సూచనలు అందించారు ఈ కార్యక్రమంలో సిద్ధవటం, ఒంటిమిట్ట పోలీసులు పాల్గొన్నారు.

