ప్రకాశం ఎస్పీ అకస్మిక తనిఖీలు.
(ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు )
ప్రకాశం జిల్లా పొన్నలూరు పెదచెర్లోపల్లి , పామూరు పోలీస్ స్టేషన్ లను మరియు పామూరు సర్కిల్ ఆఫీస్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు.,
పోలీస్ స్టేషన్లోని నిర్వహించే పలు రికార్డులు పరిశీలించి..... నమోదైన కేసులపై ఆరా తీశారు.
స్టేషన్ పరిధిలోని నేరాల కట్టడికి గట్టి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మెరుగైన పోలిసింగ్ చేయాలన్నారు.
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పోలీస్ శాఖపై మరింత నమ్మకం పెంపొందించేలా ఉత్తమ సేవలు అందించాలన్నారు.
ట్రాఫిక్ నివారణ, రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
చట్ట వ్యతిరేక,అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారి పై ప్రత్యేక నిఘా ఉండాలన్నారు.
పోలీసు స్టేషన్ల లోని లాకప్ గదులు, రిసెప్షన్, మహిళా సహాయ కేంద్ర, కంప్యూటర్ రూమ్స్ మరియు రికార్డుల నిర్వహణ, పోలీసు స్టేషన్ పరిసరాలను,క్రైమ్ మ్యాప్ ను పరిశీలించారు.
వివిధ కేసులలో సీజ్ చేయబడిన వాహనాలన్నిటిని పరిశీలించి వాటిని త్వరితగతిన డిస్పోజల్ చేయాలన్నారు.
ప్రతి స్టేషన్ ఆవరణను పచ్చదనం పెంపొందించాలని, ఆహ్లాదకరంగా ఉండేలా చర్యలు చేపట్టాలని పోలీస్ సిబ్బందికి సూచనలు చేశారు.
పోలీసు స్టేషన్ లకు సంబంధించిన ఫైళ్లను మరియు పలు రిజిస్టర్ లను క్షుణ్ణంగా పరిశీలించారు.
పాత పెండింగ్ కేసులు పురోగతి, దర్యాప్తు ఏ విధంగా జరుగుతున్నది మొదలగు అంశాలను గూర్చి ఆరా తీసి సదరు కేసుల ఛేదింపునకు దోహదపడే దర్యాప్తు విధానాలపై పోలీసులకు ఎస్పీ గారు పలు సూచనలు చేసారు.
స్టేషన్ పరిధిలో నేర మరియు శాంతి భద్రతల గురించి అడిగితెలుసుకొవడంతో పాటు ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా జరిగే నేరాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
దొంగతనాల కట్టడి, మిస్సింగ్ కేసులు ఛేదన, మహిళలు, చిన్న పిల్లలపై జరిగే నేరాలు, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ ను క్రమబద్దీకరించాలన్నారు.
నేరాలను అరికట్టేందుకు గస్తి ముమ్మురం చేయాలని, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని, సాంకేతికత పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, విజిబుల్ పోలీసింగ్ కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
స్టేషన్ పరిధిలో బీట్లు తిరిగే సమయంలో చెడునడత/హిస్టరీ షీట్లు కలిగిన వారిని చెక్ చేయాలని అలాంటి. వారి కదలికలపై నిఘా పెట్టాలన్నారు.
సిబ్బందికి కేటాయించిన గ్రామాలలో విధిగా పర్యటించాలని ప్రజలతో సత్సంబంధాలు కలిగి ముందస్తు సమాచారాన్ని సేకరించాలని సూచించారు.
పోలీసు స్టేషన్ల లోని సిబ్బందితో మాట్లాడి వారి పని తీరు, వారు ఏ ఏ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు, అక్కడ ఏటువంటి పరిస్థితులు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు.
పోలీస్ సిబ్బంది యూనిఫామ్ నీట్ టర్న్ అవుట్ కలిగి ఉండాలని, క్రమశిక్షణ, సమయపాలన పాటించాలన్నారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని పాటిస్తూ పొలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మెలిగి వారి ఫిర్యాదులను స్వీకరించి జవాబుదారీగా ఉండాలని, మహిళలు/పిల్లలు సంబంధిత ఫిర్యాదులపై తక్షణమే స్పదించాలని, పోలీస్ శాఖపై నమ్మకం పెంపొందించేలా సేవలు అందించాలని సూచించారు.
జిల్లా ఎస్పీ గారి వెంట కనిగిరి డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వoత్, ఎస్బి ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, పీసీ పల్లి ఎస్ఐ కోటయ్య, పామూరు ఎస్సై కిషోర్ మరియు సిబ్బంది ఉన్నారు.
