ప్రజా ఫిర్యాదులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి, త్వరితగతిన పరిష్కరించాలి: ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు.



 

ప్రజా ఫిర్యాదులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి, త్వరితగతిన పరిష్కరించాలి: ప్రకాశం జిల్లా ఎస్పీ   వి.హర్షవర్ధన్ రాజు. 


(ప్రకాశం జిల్లా మీడియా ప్రతినిధి దాసరి యోబు )

 ప్రకాశం జిల్లాఒంగోలు పట్టణంలో

పోలీస్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమానికి 116 ఫిర్యాదులు.


ప్రకాశం జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో “మీకోసం” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ  వి. హర్షవర్ధన్ రాజు,నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల అర్జీలను జిల్లా ఎస్పీ స్వయంగా స్వీకరించి వారితో ముఖాముఖిగా మాట్లాడారు. వారి సమస్యలను సమగ్రంగాఅడిగి తెలుసుకొని, చట్టపరంగా త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.

బాధితులు చెబుతున్న ప్రతి ఒక్క సమస్యలను వివరాలతో సహా ఎస్పీ గారు అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు పంపించి త్వరగా పరిష్కరిస్తామన్నారు.  

బధితులు చెబుతున్న మాటలలో వాస్తవికతను దృష్టి లో పెట్టుకుని సమస్యలను పరిష్కరించడంలో వేగం పెంచాలని అధికారులకు ఆదేశించిన ఎస్పీ గారు.

బాధితులు మన వద్దకు వచ్చి ఫిర్యాదు చేస్తే ఆసమస్యను మనం పరిష్కరిస్తే వాళ్ళకు కలిగే అనందం చెప్పలేనిదన్నారు.

ప్రతి ఒక్క సిబ్బంది... ప్రజల సమస్యలను పరిష్కరించడంలో జవాబుదారీతనం కలిగి ఉండాలన్నారు.

 ప్రత్యేకించి వికలాంగులు, వృద్ధులు, మహిళల ఫిర్యాదులకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి ఆదేశించారు.

జల్లా పోలీస్ కార్యాలయానికి రాలేనటువంటి ప్రజలు జిల్లాలోని పోలీస్ స్టేషన్లో, సర్కిల్ కార్యాలయాలు, సబ్ డివిజన్ కార్యాలయాలలో ఫిర్యాదు చేయవచ్చన్నారు.

ఆ ఫిర్యాదులను మీకోసం - ప్రజా సమస్య పరిష్కార వేదిక ఫిర్యాదులుగానే పరిగణించి సకాలంలో సత్వర న్యాయం చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్., గారు తెలిపారు.

ఆయా పోలీస్ స్టేషన్ లో అధికారులు స్పందించని పక్షంలో... అలాంటి సిబ్బంది పై చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎక్కువగా భూ వివాదాలు, కుటుంబ కలహాలు, భర్త/అత్తారింటి వేధింపులు, చీటింగ్/ఉద్యోగ మోసాలు మరియు ఇతర సమస్యలపై ప్రజా ఫిర్యాదులు స్వీకరించబడ్డాయి.

ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సుధాకర్, ఎస్సీ/ఎస్టీ సెల్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్, ఒంగోలు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పాండురంగారావు, ఒంగోలు వన్ టౌన్ సీఐ నాగరాజు, దర్శి సీఐ రామారావు, కనిగిరి సీఐ ఖాజావలి, గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్ రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post