ఇద్దరు పల్నాడు జిల్లా సీఐలపై సస్పెన్షన్ వేటు.
గతంలో పల్నాడు జిల్లాలో పని చేసిన ఇద్దరు CI లపై సస్పెన్షన్ వేటు పడింది. 2022 జూన్ 3వ తేదీన దుర్గి (M) జంగమేశ్వరపాడుకు చెందిన TDP నేత జల్లయ్య హత్య కేసులో నిందితులను వదిలేసి అతడి బంధువులను నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూటమి సర్కారు విచారణకు ఆదేశించింది. అప్పట్లో మాచర్ల రూరల్ CI షమీముల్లా, కారంపూడి జయకుమార్ కేసు తారుమారు చేశారని ఇద్దరిని సస్పెండ్ చేశారు.*
