శ్రీకాళహస్తి దేవస్థానం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు, సారె సమర్పణ.
విజయవాడ.
అన్నపూర్ణ దేవిగా దర్శనమిస్తున్న దుర్గా అమ్మవారికి శ్రీకాళహస్తి దేవస్థానం తరపున పట్టు వస్త్రాలను, సారెను శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ కుమార్ రెడ్డి, శ్రీకాళహస్తి దేవస్థాన ఈవో టి. బాపిరెడ్డి సమర్పించారు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర ఆలయం నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలు, సారె సమర్పించడం ఆనవాయితీ అని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు. వేద పండితులు, మహిళలతో కలిసి పట్టు వస్త్రాలు, సారె సమర్పించడం ఆనందంగా ఉందని చెప్పారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండి, అభివృద్ధి పథంలో సాగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా విఐపి లు నిర్దేశిత సమయంలోనే దర్శనం చేసుకోవాలని సూచించారు.
