అమ్మవారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో సాగాలి - భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్.


 



అమ్మవారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో సాగాలి -  భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్.


అమ్మవారిని దర్శించుకోవడం దివ్యమైన అనుభూతి -  భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్.

దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో విజయవాడ ఒకటి- భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్.

ఇంద్రఖీలాద్రి.

దసరా శరన్నవరాత్రులలో మూడవ రోజు అయిన బుధవారం అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఉపరాష్ట్రపతికి రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, విఎంసి కమిషనర్ ధ్యానచంద్ర, దుర్గగుడి ఈవో శీనా నాయక్ స్వాగతం పలికారు. ఉపరాష్ట్రపతి క్యూలైన్లలోని భక్తులకు అభివాదం చేస్తూ మహా మండపానికి చేరుకున్నారు. అక్కడ ఉపరాష్ట్రపతి దంపతులకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి సన్నిధికి చేరుకొని అన్నపూర్ణ దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకున్నారు. వేద పండితులు వేదాశీర్వచనం చేయగా, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఈవో శీనా నాయక్ ఉపరాష్ట్రపతికి అమ్మవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

అనంతరం ఉపరాష్ట్రపతి మీడియాతో మాట్లాడుతూ....   అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకోవడం దివ్యానుభూతి అని చెప్పారు.  ప్రజలందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. దేశంలో  వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో విజయవాడ ఒకటని చెప్పారు. రాష్ట్రం అద్భుతమైన వృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేశారు.


Post a Comment

Previous Post Next Post