సి ఐ టి యు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.


 సి ఐ టి యు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.


కార్మికుల పని గంటలను 8 నుండి 13 కి పెంచుతూ శాసనసభ, శాసనమండలిలో చేసిన తీర్మానాలను రద్దు చేయాలి .

సిఐటియు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారులకు, పారిశ్రామిక వేతలకు అనుకూలంగా 8 గంటల పనిని 13 గంటలకు పెంచుతూ శాసనసభలో, శాసన మండలిలో తీర్మానం చేయడం కార్మికులను కట్టు బానిసలుగా మార్చడమేనని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి టి ఆవులయ్య అన్నారు. 

 ప్రకాశం జిల్లా గిద్దలూరు సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం దగ్గర సీఐటీయూ గా నిరసన తెలియజేయడం జరిగింది.

తక్కువ వేతనాలు చెల్లిస్తూ కార్మికులతో ఎక్కువ పని చేయించుకోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. 

ఈ పని గంటలు పెంచుతూ చేసిన తీర్మానాన్ని శాసనసభలో, శాసనమండలిలో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఓటు వేయకుండా వాకౌట్ చేయడం కార్మికులను మోసం చేయడమేనని అన్నారు. 

రాబోయే రోజులలో కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి పని గంటలు తగ్గించేంతవరకు ఆందోళన చేస్తామని అన్నారు. 

ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం మురళి, డి రంగయ్య, పి రవి, ప్రవీణ్ కుమార్, చంటయ్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post