కనిగిరిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక..
( ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు )
ప్రకాశం జిల్లా కలెక్టర్ మరియు. జిల్లా మెజిస్ట్రేట్ పి. రాజబాబు ఆధ్వర్యంలో కనిగిరి డివిజన్ లోని కనిగిరి. నియోజకవర్గంలో ని పవిత్ర కళ్యాణ మండపంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కలెక్టర్ పి రాజాబాబు.
కనిగిరి డివిజన్లోని వివిధ మండలాల వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున ప్రజా సమస్యలపై ప్రజలు పాల్గొన్నారు.
డివిజన్ నుండి వివిధ శాఖల సమస్యలపై అధికారులు ప్రజలకు సహకరించలేదని వివిధ రెవెన్యూ మరియు పంచాయతీ శాఖ పైన ప్రజలు అర్జీలు ఇవ్వటం జరిగింది.
ముఖ్యంగా వివిధ గ్రామాల రెవెన్యూ సమస్యల పైన. మరియు అక్రమ రిజిస్ట్రేషన్ల పైన మా భూములు మరొకరికి రిజిస్ట్రేషన్లు జరిగాయని కలెక్టర్ కు అర్జీలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ స్పందించి తక్షణమే సమస్య పరిష్కారం చేయాలని వేదికపైకి తాసిల్దార్లను పిలిచి తక్షణమే పరిష్కారం చేయాలని అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో డిఆర్ఓ చిన్న ఓబులేసు. స్థానిక శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి. మార్కాపురం శాసనసభ్యులు.కందుల నారాయణరెడ్డి. వివిధ మండలాల తాసిల్దార్లు. వివిధ మండలాల ఎంపీడీవోలు. వ్యవసాయ శాఖ అధికారులు. పంచాయితీ ఏఈలు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ
లు.రవాణాశాఖ విద్యుత్ శాఖ తదితర శాఖల అధికారులు. సమస్యలపై వచ్చిన ప్రజలు ప్రజా పరిష్కార వేదికలో పాల్గొన్నారు..

