తండ్రి చేసిన తప్పుకు మైనర్ బాలుడిని నిర్బంధించిన అటవీ శాఖ అధికారులు.
(ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు)
అభము శుభము తెలియని మైనర్ బాలుడు కోసం ఎదురు చూస్తున్న తల్లి.
తండ్రి అడవి మాంసము తెచ్చాడని 8వ తరగతి చదువుతున్న నరేష్ అనే విద్యార్థిని ప్రకాశం జిల్లా గిద్దలూరు అటవీశాఖ అధికారులు నిర్బంధించారు తన బిడ్డను వదలాలని అటవీశాఖ కార్యాలయం ఎదుట పడికాపులు కాస్తున్న తల్లి
కనికరంచని అధికారులు. 8వ తరగతి చదువుతున్న మైనర్ బాలుని నిర్బంధించటము చట్టరిత్య నేరమని తెలియదా ఆ అధికారులకు? మైనర్ బాలుడు నేరం చేసి ఉండి ఉంటే 24 గంటలలో శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్ప చెప్పాలి కానీ అటవీ శాఖ కార్యాలయంలో నిర్బంధించటం నేరం అని తెలియదా.? ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం మైనర్ బాలుడిని అటవీశాఖ అధికారుల నిర్బంధం నుండి విడిపించాలని ప్రజలు కోరుచున్నారు .
