ఇంద్రఖీలాద్రి దుర్గమ్మకు సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించిన AP CM చంద్రబాబునాయుడు.
(విజయవాడ క్రైం 9 మీడియా ప్రతినిధి)
ఇంద్రఖిలాద్రి పై కొలువున్న దుర్గమ్మ దేవినవరాత్రులు సందర్భముగా మూలా నక్షత్రం రోజున అమ్మవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున సతీ సమేతంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్పించడం జరిగింది.. ఆలయానికి విచ్చేసిన ముఖ్యమంత్రి దంపతులను వేద మంత్రాలతో ఆహ్వానించి శాస్త్రోత కంగా వేద ఆశీర్వాద్ధం ఇచ్చి న ఆలయ సిబంది..సరస్వతి దేవి రూపంలో దర్శనం ఇస్తున్న అమ్మవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి దంపతులు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా, అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు సక్రమంగా చూసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

