దళిత రణభేరి కరపత్రాల ఆవిష్కరణ.
బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే దళిత రణభేరిని కార్యక్రమాన్ని జయప్రదం చేయండి పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు - కంభంపాటి నాగ వంశీ పిలుపు.
పలనాడు జిల్లా నూజెండ్ల మండలం ఉప్పలపాడు గ్రామం నందు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 24న విజయవాడలో జరిగే దళిత రణభేరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కంభంపాటి నాగ వంశీ పిలుపునిచ్చారు రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గతంలో వై.సీ.పీ ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం దళితుల మీద దాడులకు నిరసనగా ఈ కార్యక్రమానికి వినుకొండ నియోజకవర్గం నుండి వందలాది మంది పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు రవికుమార్. పార్టీ నాయకులు సంఘం శ్రీకాంత్ రెడ్డి.పూనూరి జాన్సన్.నూజెండ్ల మండల ఉపాధ్యక్షులు విజయ్. బీఎస్పీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

