మాలలను అణిచివేస్తే ఏ ప్రభుత్వానికైనా పతనం తప్పదు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ళ అరుణ్ కుమార్.


 

మాలలను అణిచివేస్తే ఏ ప్రభుత్వానికైనా పతనం తప్పదు 

మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ళ అరుణ్ కుమార్.

పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం పట్టణ కేంద్రంలోని హనుమాన్ నగర్ లో మాల మహానాడు నియోజకవర్గ కార్యాలయం ప్రారంభోత్సవానికి జాతీయ అధ్యక్షులు గోళ్ళ అరుణ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదా జాన్ పాల్ పాల్గొని ప్రారంభించారు

 ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి అధ్యక్షులుగా మాల మహానాడు కోశాధికారి పెనుమాల రమేష్ అధ్యక్షతవహించగా వక్తలు మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో మాలలకు ఏ సమస్య వచ్చిన నియోజకవర్గ కమిటీతో పాటు జిల్లా రాష్ట్ర జాతీయ కమిటీ అండదండలుగా ఉంటుందని నియోజకవర్గం లోని మాలలందరినీ ఏకం చేస్తూ ఎస్సీ వర్గీకరణ పేరిట మాలలకు జరుగుతున్న అన్యాయంపై వివరిస్తూ వారిని చైతన్య పరుస్తూ రాష్ట్రంలో కైకలూరు లోని దాన గూడెం లాంటి గ్రామాలలో మాలలపై జరుగుతున్న దాడులను అరికట్టే దిశగా, మేమున్నాం అనే భరోసా ఇచ్చే దిశగా మాల మహానాడు నాయకులు మాల సైన్యం పనిచేయాలని రానున్న అసెంబ్లీ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ పై మరోసారి చర్చ జరపాలని తెచ్చిన ఆర్డినెన్స్ రద్దు చేయాలని రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని ఎస్సీ ఎస్టీ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చే విధంగా ప్రజాప్రతినిధులు మాట్లాడాలని నాయకులు కోరుతూ గత ప్రభుత్వంలో దళిత గిరిజనులకు సంబంధించిన పథకాలను ఏ విధంగా నిర్వీర్య పరిచారో తదుపరి ఎన్నికలలో ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారు ఆ పరిస్థితి నేటి కూటమి ప్రభుత్వం తెచ్చుకోవద్దని పాలకులను హెచ్చరిస్తూ మాలలకు ఉన్న జనాభా నిష్పత్తి ప్రకారం మూడు మంత్రి పదవులు ఇవ్వాలని కేవలం ఒక మంత్రి పదవితో సరిపెట్టి ఎక్కడ మాలల అన్యాయం జరిగిన మాట్లాడలేని పరిస్థితిలోకి మాల ప్రజాప్రతినిధులను తీసుకొచ్చారన్నారు.

ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న మెజారిటీ ప్రజలు కలిసిన మాలను గుర్తించి ప్రభుత్వం వారికి తగిన అవకాశాలు కల్పించకపోతే కచ్చితంగా రానున్న రోజుల్లో మాలల పంతం వర్గీకరణ వాదుల అంతం అనే నినాదంతో పెద్ద పోరాటానికి పిలుపునిస్తావని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనపర్తి లలిత్ బాబు, ఆర్పిఐ పార్టీ జిల్లా అధ్యక్షులు వంజా ముత్తయ్య,నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షులు రాయిని చిన్న, నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షులు బేతం దేవానంద్ జిల్లా ఉపాధ్యక్షులు కొండ్రు విజయ్, జిల్లా వర్కింగ్ అధ్యక్షులు గుడిపూడి ఏసురత్నం, నియోజకవర్గం గౌరవ అధ్యక్షులు పగిడిపల్లి ఇశ్రాయేలు, నియోజకవర్గం ఉపాధ్యక్షులు కొమ్మతోటి సుధాకర్, ప్రధాన కార్యదర్శి బొందలపాటి నాగేశ్వరరావు, నియోజకవర్గ కార్యదర్శి దార్ల ఎర్రయ్య, గౌరవ సలహాదారులు కొమ్మ తోటి కృపయ్య ఈపూరు మండల అధ్యక్షులు పెనుమాల వెంకట్రావు పట్టణ ఉపాధ్యక్షులు కొట్టే మనోజ్ ధార పాపారావు ఫైయర్ద అనిల్ ప్రధాన కార్యదర్శి జ్యోతి మల్లికార్జున్ రావు కార్యదర్శి అంబడిపూడి శ్రీనివాసులు బొల్లాపల్లి మండల యూత్ అధ్యక్షులు కీర్తిపాటి గోవిందరాజులు వినుకొండ మండల అధ్యక్షులు పిడతలని అనిల్ ఉపాధ్యక్షులు చలమాల రామాంజనేయులు ప్రధాన కార్యదర్శి పిడతల రాజా నూజెండ్ల మండల అధ్యక్షులు అందుకూరి గురుమూర్తి ఉపాధ్యక్షులు మాలపాటి భాగ్యరాజు ప్రధాన కార్యదర్శి మాలపాటి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post