(ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.)
ప్రకాశం జిల్లా కంభం మండలం చిన్న కంభం గ్రామ సమీపంలో గురువారం కూలీలతో వెళుతున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే అంబులెన్స్ లో కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బేస్తవారిపేట నుండి రాచర్ల మండలం అన్నంపల్లెకు పత్తి కోసేందుకు వెళుతుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
