మార్కాపురం లో మినీ మిర్చి యార్డ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర అసెంబ్లీలో కోరిన కందుల నారాయణరెడ్డి.
మార్కాపురం లో మినీ మిర్చి యార్డ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర అసెంబ్లీలో కోరిన మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి. ఒక రైతుబిడ్డగా రైతుల కష్టాలు తెలిసిన మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి.
ప్రకాశం జిల్లామార్కాపురంలో ఒక మినీ మిర్చి యార్డ్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా కోరారు. పూర్తిగా రైతు సాధక బాధలు తెలిసిన మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాలలో ప్రతి సంవత్సరం దాదాపు లక్ష ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేస్తున్నారని దీనివల్ల దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు మిర్చి యార్డుకు రైతులు తమ మిర్చి పంట ఉత్పత్తిని తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉందని తద్వారా రవాణా ఖర్చులు, ఇతర ఖర్చులు, పని భారం పెరగి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని రెవిన్యూ డివిజన్ కేంద్రమైన మార్కాపురంలో ఒక మినీ మిర్చి యార్డ్ ఏర్పాటు చేస్తే అన్ని రకాల ఖర్చులు తగ్గి రైతులు లాభపడతారని అన్నారు. రైతుల ఇబ్బందులు తెలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు , రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు శ్రీ కింజరపు అచ్చం నాయుడు గార్లను అత్యంత వెనుకబడిన పశ్చిమ ప్రకాశం ప్రాంత రైతుల ఇబ్బందులు తెలుసునని త్వరలోనే ఒక మినీ మిర్చి యార్డు మార్కాపురంకు మంజూరు చేయాలని కోరారు. దీనితో పశ్చిమ ప్రకాశం రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.