ప్రకాశం జిల్లా..కనిగిరిలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక లో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేత..


 

ప్రకాశం జిల్లా..కనిగిరిలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక లో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేత.. 


ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.

ప్రకాశం జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ సీనియర్ సహాయకులు గ్రంధి రవితేజ అవినీతిపై విజిలెన్స్ విచారణ జరిపించాలని కోరిన నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి జిల్లా అధ్యక్షులు ముల్లా మదార్ వలి.

ప్రకాశం జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ సీనియర్ సహాయకులుగా విధులు నిర్వహిస్తున్న గ్రంధి రవితేజ వచ్చినప్పటినుండి దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ లో పలు అక్రమాలతో పాటు ఒంగోలు సంతపేటలోని వికలాంగుల బాలుర వసతి గృహంలో పలు అక్రమాలకు పాల్పడ్డారు ఇంచార్జ్ వార్డెన్ గా ఉంటూ ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థులకు కేటాయించిన పలు నిధులను దొంగ బిల్లులతో ట్రెజరీ ద్వారా డబ్బులు డ్రా చేసి సొంతానికి వాడుకున్నారు. ,అంతేకాక వసతి గృహంలో విధులు నిర్వహిస్తున్న దివ్యాంగ ఉద్యోగులను కూడా తన సొంత ప్రయోజనాలకు మరియు కార్యాలయ పనులకు వాడుకుంటున్నారని పూర్వపు కలెక్టర్ గౌరవ తమీమ్ అన్సారియ గారిని కలిసి పీ.జీ. ఆర్.ఎస్. లో ఫిర్యాదు చేస్తే గ్రంధి రవితేజను మందలించటం కూడా జరిగింది. జూలై 2024 నుండి ఫిబ్రవరి 2025 వరకూ దివ్యాంగుల వసతి గృహంలో జరిగిన ఆర్థికపరమైన అంశాలకు సంబంధించిన విషయాలపై ట్రెజరీ ద్వారా జరిగిన లావాదేవీలను ఒక్కసారి నిశితంగా పరిశీలించి విజిలెన్స్ విచారణ జరిపించవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల నియామక భర్తీ ప్రక్రియలో చోటుచేసుకున్న పలు అవకతవకలకు గ్రంధి రవితేజ నే ప్రధాన కారణం.కనుక తమరు పై విషయాలన్నిటిపై సమగ్రంగా విచారించి, పరిశీలించి దివ్యాంగుల సంక్షేమం కోసం గ్రంధి. రవితేజ పై వచ్చిన ఆరోపణల మీద వెంటనే విజిలెన్స్ విచారణ జరిపించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరడం జరిగింది. పీ . చంద్రశేఖర్, కె. రంగస్వామి,మందుల. కృష్ణ, కే. వెంకటేశ్వర్లు, సయ్యద్. సుభాని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు....

Post a Comment

Previous Post Next Post