ప్రకాశం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ గారిని కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు.
క్రైమ్ 9 మీడియా జిల్లా ప్రతినిధి దాసరి యోబు.
ఈరోజు ప్రకాశం జిల్లా కనిగిరిలోని పవిత్ర కన్వెన్షన్ హాల్ నందు జరిగిన గ్రీవెన్స్ సెల్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రకాశం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ పి రాజా బాబు. గారిని ఎమ్మార్పీఎస్ కనిగిరి నియోజకవర్గం ఇంచార్జ్ రావినూతల కోటయ్య మాదిగ మరియు ఎమ్మార్పీఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు నేలపాటి రాజు మాదిగ కలెక్టర్ ను శాలువాతో సత్కరించి ఈ ప్రాంతంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగినది
ఈ కార్యక్రమంలో వెలిగండ్ల మండల అధ్యక్షులు గూడూరి శేఖర్ మాదిగ, ఎంఎస్పి వెలిగండ్ల మండల అధ్యక్షులు జుటీకె డానియల్ మాదిగ, వెలిగండ్ల మండలం ప్రధాన కార్యదర్శి కుమ్మరికుంట రాజు మాదిగ,హనుమంతునిపాడు మండలం ఎంఎస్పి ఇన్చార్జ్ జుటీకే రామయ్య మాదిగ,మహిళ విభాగం నియోజకవర్గం నాయకురాలు జయ మానిక్యం, గుదేవారిపాలెం ఎమ్మార్పీఎస్ నాయకులు గోచిపాతల యోహాను మాదిగ మరియు కనిగిరి నియోజకవర్గం ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు.

