రైతుల పక్షాన ఎల్లప్పుడూ ఎన్డీఏ కూటమి నిలుస్తుందని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.




రైతుల పక్షాన ఎల్లప్పుడూ ఎన్డీఏ కూటమి నిలుస్తుందని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.

మంగళవారం బర్రింకలపాడు క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ –
నియోజకవర్గంలోని రైతులకు యూరియా సహా అన్ని రకాల ఎరువులు ఎలాంటి కొరత లేకుండా సరఫరా అవుతున్నాయని, అయినప్పటికీ ప్రతిపక్షాలు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. వైసీపీ పార్టీకి చెందిన కొందరు రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రస్తుతం నియోజకవర్గంలోని 24 సొసైటీల పరిధిలో కుక్కునూరులో 50 మె.టన్.వేలేరుపాడులో 25 మె.టన్., జీలుగుమిల్లిలో 60 మె.టన్., బుట్టాయిగూడెంలో 27 మె.టన్., పోలవరంలో 70 మె.టన్., కొయ్యలగూడెంలో 90 మె.టన్., టీ.నర్సాపురంలో 65 మె.టన్. – మొత్తం 370 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని ఎమ్మెల్యే వివరించారు.

తప్పుడు ప్రచారం చేస్తూ రైతులను మభ్యపెట్టే వారిపై త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం వ్యవసాయ అధికారులు, జీలుగుమిల్లి జనసేన మండల అధ్యక్షులు పసుపులేటి రాము, టిడిపి మండల అధ్యక్షులు సుంకవెల్లి సాయి, కూటమి నాయకులు నాలి శ్రీనివాస్, కుంజ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post