రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులు పంపిణీ చేస్తాం - జిల్లా వ్యవసాయాధికారి ఎస్.కె. హబీబ్ భాషా.
రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దు.
ప్రగడపల్లి సొసైటీకి 25 మెట్రిక్ టన్నులు, జిల్లాళ్లగూడెం, వింజరం ఆర్ ఎస్ కె లకు 12. 5 మెట్రిక్ టన్నులు చొప్పున అందించాం.
ఏలూరు/పోలవరం, సెప్టెంబర్, 9 : రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులు పంపిణీ చేస్తామని, ఎరువుల పంపిణీ విషయంలో రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని జిల్లా వ్యవసాయాధికారి ఎస్.కె. హబీబ్ బాషా విజ్ఞప్తి చేశారు. పోలవరం మండలం ప్రగడపల్లిలోని ప్రాధమిక వ్యవసాయ సహకార సొసైటీ లో ఎరువుల పంపిణీని మంగళవారం హబీబ్ భాషా పరిశీలించారు. ఈ సందర్భంగా హబీబ్ భాషా మాట్లాడుతూ జిల్లాలో యూరియా, ఎరువులకు ఎటువంటి లేదని ప్రతీ రైతుకు వారి అవసరాలకు తగినవిధంగా ఎరువులు అందిస్తామన్నారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దన్నారు. ప్రగడపల్లి ప్రాధమిక వ్యవసాయ సహకార సొసైటీ లో ప్రస్తుతం 12. 6 మెట్రిక్ టన్నుల ఎరువులు నిల్వలు ఉన్నాయని, మరో 25 మెట్రిక్ టన్నులు ఎరువులను మంగళవారం సాయంత్రానికి చేరుకున్నాయన్నారు. అదేవిధంగా జిల్లెళ్లగూడెం, వింజరం రైతు సేవా కేంద్రాలకు 12. 5 మెట్రిక్ టన్నుల చొప్పున మంగళవారం సాయంత్రానికి చేర్చడం జరిగిందని, ప్రతీ రైతు అవసరాలకు అనుగుణంగా ఎరువులు సరఫరా చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దుని హబీబ్ భాషా విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాలోని రైతుల ఎరువుల అవసరాలను జిల్లా కలెక్టర్ ను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారని, రైతుల అవసరాల మేరకు అవసరమైన ఎరువులను జిల్లాకు సరఫరా చేస్తున్నారన్నారు. జిల్లా కలెక్టర్ కూడా మండల స్థాయిలోను, సొసైటీలలలోనూ వారం నకు అవసరమైన ఎరువులను ముందుగానే తెలుసుకుని వాటి సరఫరాకు చర్యలను తీసుకుంటున్నారన్నారు. ఈ సందర్భంగా సొసైటీలో ఉన్న ఎరువుల నిల్వలు, పంపిణీని హబీబ్ భాషా పరిశీలించారు.
