స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ.
పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని 12వ వార్డు అంబేద్కర్ కాలనీ* లో సోమవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు శ్రీ జీవీ ఆంజనేయులు హాజరై లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. రేషన్ వ్యవస్థలో పారదర్శకత కోసం స్మార్ట్ రేషన్ కార్డులను కూటమి ప్రభుత్వం తీసుకువచ్చినట్లు తెలిపారు. కొత్త కార్డుల ద్వారా లబ్ధిదారులు రాష్ట్రంలోని ఏ చౌక ధరల దుకాణాల్లోనైనా రేషన్ సరుకులు తీసుకునే వెసులుబాటు కలుగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిడిసిసిబి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు.జనసేన నాయకులు నాగ శ్రీను రాయల్, కౌన్సిలర్లు, నాయకులు, రేషన్ కార్డ్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
