చందాపురం గ్రామంలో ఫీవర్ సర్వేలో ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య.
నందిగామ మండలం చందాపురం గ్రామంలో సోమవారం జరిగిన ఫీవర్ సర్వే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, మరియు శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె వైద్య సిబ్బందికి డయేరియా కేసులు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు
ప్రతి ఇంటిని పూర్తిగా సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య రక్షణ ప్రణాళికలలో భాగంగా జరిగింది.డెంగ్యూ, మలేరియా వంటి జ్వర వ్యాధులతో పాటు డయేరియా వంటి ఇతర ఆరోగ్య సమస్యలపై ముందస్తు చర్యలు తీసుకునేందుకు ఈ సర్వే నిర్వహించారు.
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యం మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత. డయేరియా, జ్వర వంటి కేసులను గుర్తించి, తక్షణ చర్యలు తీసుకోవాలి. ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది ప్రతి ఇంటికీ తిరిగి పూర్తి సమగ్ర సర్వే చేయాలి" అని ఆదేశించారు.
కార్యక్రమంలో ఆశా వర్కర్లు, ఆరోగ్య సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సర్వేలో ఇంటింటికీ తిరుగుతూ సర్వే నిర్వహించారు. ఎమ్మెల్యే సౌమ్య గ్రామంలోని పలు ఇళ్లను స్వయంగా సందర్శించి, ప్రజల సమస్యలు విని, తక్షణ పరిష్కారాలు సూచించారు.
ఈ చర్యల ద్వారా గ్రామంలో ఆరోగ్య అవగాహన పెరిగిందని, వ్యాధి నివారణకు మంచి ఫలితాలు వస్తాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు.

