అల్లరి చేస్తోందని విద్యార్థిని తలపై కొట్టిన టీచర్.. చిట్లిన పుర్రె ఎముక.
చిత్తూరు జిల్లా పుంగనూరులోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో సాత్విక నాగశ్రీ (11) అనే బాలిక ఆరో తరగతి చదువుతుంది.
క్లాస్‌లో అల్లరి చేస్తోందని హిందీ టీచర్ ఆమె తలపై స్కూల్ బ్యాగ్‌తో కొట్టడంతో తీవ్రంగా గాయపడింది.
మొదట తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోకపోయినా, తలనొప్పి తీవ్రత పెరగడంతో దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.
అనంతరం బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయగా.. పుర్రె ఎముక చిట్లినట్లు తేలింది.
దీంతో విద్యార్థి తల్లి స్కూల్ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు
