కోన పల్లెలో పొలం పిలుస్తుంది కార్యక్రమం.
(బేస్తవారి పేట క్రైమ్ 9 రిపోర్టర్ )
ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలోని కోనపల్లి మరియు నారువానిపల్లి గ్రామాలలో పొలంపిస్తోంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ఈ సంవత్సరం రబీ సీజన్లో నల్ల బర్లి పొగాకు సాగును నిషేధించడం అయినదని వైట్ బర్లి పొగాకు సాగు చేయు రైతులు తప్పనిసరిగా కంపెనీ నుండి బైబ్యాక్ అగ్రిమెంట్ తీసుకున్న వారు మాత్రమే పంట సాగు చేయాలని తెలియజేసినారు.
నానో యూరియా వాడటం వలన రైతులకు ఈ క్రింది ఉపయోగాలు కలవు.
a. ఒక ఆఫ్ లీటర్ నానో యూరియా బాటిల్ నందు ఒక బస్తా యూరియాలో ఉండే పోషకాలు అన్ని ఉంటాయి. నానో యూరియాను పురుగుమందులతో కలిపి పిచికారి చేసుకొనవచ్చును. నానో యూరియా పిచికారి వలన మొక్క ఆకులపై పడి నేరుగా మొక్క పత్ర రంధ్రముల ద్వారా స్వీకరించును తద్వారా వృధా అనునది చాలా తక్కువ. పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. నానో యూరియాను తీసుకెళ్లడం చాలా తేలికైన పని ఆ విధంగా రైతుకు శ్రమ చాలా వరకు తగ్గుతుంది. కావున రైతులందరూ పంటలకు పై పాటుగా యూరియా బస్తాలకు బదులు నానో యూరియా వాడుకోవాలని తెలియజేసినారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి షేక్ అబ్దుల్ రఫీక్ వ్యవసాయ విస్తరణ అధికారి ఎన్ ఆది గణేష్ రైతు సేవ కేంద్రం సిబ్బంది వరప్రసాద్ మరియు గ్రామ రైతులు పాల్గొనడం జరిగింది.
