ఆత్మ హత్యలు,వ్యసనాలు లేని సమాజం కోసం పిలుపు - ఏపీ ఈగల్ చీఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆకే.రవికృష్ణ,
ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం, సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పరిధిలోని ఇండ్లస్ శాంతివన్ డీ-అడిక్షన్ మరియు రిహాబిలిటేషన్ సెంటర్ ఐజి ప్రత్యేకంగా సందర్శించి పరిశీలించినారు. ఈ సందర్శన సందర్భంగా ఐజి మాట్లాడుతూ:మాదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండటం, వ్యసన విముక్తి సాధించడం, మరియు ఆత్మహత్యలను నిరోధించడం ద్వారా ప్రజలను ఆరోగ్యకరమైన జీవన విధానాల వైపు ప్రోత్సహించాలన్న ఉద్దేశం తో సందర్శించడం జరిగిందని తెలియజేశారు,చికిత్స కేంద్రంలో 80 మంది చికిత్స పొందుతుండగా వీరిలో 62 మంది పురుషులు, 18 మంది మహిళలు. వీరికి శాస్త్రీయ పద్ధతి లో వైద్య చికిత్సతో పాటు కౌన్సెలింగ్, వ్యసన విముక్తికి అవసరమైన కార్యక్రమాలు, శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి తోడ్పడే శిక్షణలు అందిస్తున్నారు.
డీ-అడిక్షన్ సెంటర్‌లో ప్లేగ్రౌండ్, లైబ్రరీ, ఎమర్జెన్సీ వార్డు, ఫుడ్ కోర్ట్ వంటి సౌకర్యాలను పరిశీలించినారు.బాధితులతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ, వారి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక కష్టాలు మరియు వ్యక్తిగత సమస్యలను అడిగి తెలుసుకున్నారు.బాధితులు ఎక్కువగా మద్యం, పొగ తాగడం, మొబైల్ గేమ్స్, క్రికెట్ బెట్టింగ్ వంటి వ్యసనాలకు గురైనవారు.
విద్యార్థులు, యువత అవగాహన కలిగి ఉండాలి
ఒక విద్యార్థి తన రోజు దిన చర్యలో అధిక శాతం చరణవాణి వాడకం వలన జీవితంలో ఎదుర్కొన్న నష్టాలను ఉదాహరణగా వివరించారు.
విద్యార్థులు స్నేహితుల ప్రభావంతో గంజాయి వ్యసనానికి అలవాటు పడి శారీరక, మానసిక, ఆర్థిక నష్టాలకు గురై కుటుంబాలను మానసిక వేదనకు గురి చేసిన విషయాలను ప్రస్తావించారు.
ప్రజలకు సూచనలు,
మాదకద్రవ్యాలు వ్యక్తి జీవితాన్నే కాదు, కుటుంబాలను, సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని హెచ్చరించారు.
వ్యసనాలను దూరంగా ఉంచేందుకు అందరూ కలసి కృషి చేయాలని, ముఖ్యంగా యువత ఇలాంటి వ్యసనాలకు బలి కాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.
సమాజాన్ని బలమైనదిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.
డీ- అడిక్షన్ మరియు రీహాబిలిటేషన్ సెంటర్లు వ్యసన విముక్తి కేంద్రాలను అందుబాటు లో ఉంచి వైద్యసహాయం, కౌన్సెలింగ్ అందిస్తున్న వైద్య నిపుణులను, నిర్వాహకులను,ఐ.జి.రవి కృష్ణ అభినందించారు.
