ఆర్ ఎస్ ఏ ఎస్టీ ఎఫ్ ఆధ్వర్యంలో ఎర్రచందనం స్మగ్లర్ల పట్టివేత.
15 ఎర్రచందనం దుంగలు స్వాధీనం.
15మంది స్మగ్లర్లు అరెస్ట్.
రెండు కార్లు సీజ్.
అన్నమయ్య జిల్లా సానిపాయ అటవీప్రాంతంలో 15 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని,
15మంది స్మగ్లరును టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి నుంచి స్మగ్లింగ్ కు ఉపయోగించిన రెండు కార్లను సీజ్ చేశారు.
టాస్మ్ ఫోర్స్ హెడ్ సుబ్బారాయుడు ప్రత్యేక కార్యాచరణలో భాగంగా టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో డిఎస్పీ ఎండీ షరీఫ్ మార్గనిర్దేశకత్వంలో ఆర్ఐ సాయి,గిరిధర్ కు చెందిన ఆర్ఎస్ఐ లింగాధర్ టీమ్ అన్నమయ్య జిల్లా సానిపాయ, వీరబల్లి ప్రాంతంలో కూంబింగ్ చేపట్టి అప్పయ్యగారిపల్లి అటవీప్రాంతంలో చేరుకునే సరికి అక్కడ రెండు కార్లు కనపడ్డాయి.వాటిని సమీపించడంతో కొంతమంది వ్యక్తులు ఎర్రచందనం దుంగలను కార్లలోకి లోడ్ చేస్తుండగా వెంటనే దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగం లొకి దిగి వారిని చుట్టుముట్టగా స్మగ్లర్లు పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే వారిని వెంబడించి 15మందిని పట్టుకున్నారు. వాహనాలు తనిఖీ చేయగా 15 ఎర్రచందనం దుంగలు లభించాయి. పట్టుబడిన వారిని అన్నమయ్య, చిత్తూరు, జిల్లాలకు చెందిన వారుగా గుర్తించారు.
వాహనాలు, దుంగలతో సహా వారిని తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు.
స్మగ్లర్లను డీఎస్పీ వి.శ్రీనివాస రెడ్డి, ఏసీఎఫ్ జె.శ్రీనివాస్ లు విచారించి. సీ ఐ సురేష్ కుమార్. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
