విగ్రహా ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న గిద్దలూరు శాసనసభ్యులు సోదరుడు కృష్ణ కిషోర్ రెడ్డి.
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం, సర్విరెడ్డిపల్లె గ్రామంలో శ్రీశ్రీశ్రీ అంకాలమ్మ, పోలేరమ్మ అమ్మవార్ల విగ్రహా ప్రతిష్ట మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు శాసనసభ్యులు సోదరుడు శ్రీ ముత్తుముల కృష్ణ కిషోర్ రెడ్డి మరియు మాజీ ఎంపిటిసి ముత్తుముల సంజీవరెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గోన్నారు. విగ్రహా ప్రతిష్ట అనంతరం ఆలయంలో అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గోని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్బంగా ఆలయ పూజారి అమ్మవారి తీర్ధ ప్రసాదాలు, వేద మంత్రాలు ఆశీర్వచనాలు అందించారు.. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు, భక్తులు పాల్గోన్నారు.
