గిద్దలూరు నియోజకవర్గం ప్రజలు అప్రమత్తంగా సురక్షితంగా ఉండాలి- షేక్. ఇర్ఫాన్.
ప్రకాశం జిల్లాలో బంగాళాఖాతంలో వాయుగుండం వల్ల రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో.. ప్రజలు అప్రమత్తంగా, సురక్షితంగా ఉండాలని గిద్దలూరు నియోజకవర్గం యువ నాయకులు ఇర్ఫాన్ సూచించారు. వాయుగుండం తీరం దాటేప్పుడు వర్షాలు మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నందున. ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. చెరువులు, నదులు, వాగులు ఎక్కువగా పారే చోట ప్రజలు ప్రయాణం చేయవద్దు. యువ నాయకులు ఇర్ఫాన్ సూచించారు.
