ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి .
Eluru ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజల నుండి వినతులు స్వీకరించిన ఆయన,,, ఆయా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నివర్గాల ప్రజలకు న్యాయం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తున్నామన్నారు. దీంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు శరవేగంగా అమలవుతున్నాయని చెప్పారు. దీంతోపాటూ ప్రజాసమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడుతున్నామని, రానున్న కాలంలో మరిన్ని సమస్యలకు చెల్లుచీటి ఇచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నట్లు ఆయన ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...

.jpeg)
.jpeg)
