తూ గో జిల్లా.నల్లజర్ల మండలంలో రేవ్ పార్టీ కలకలం రేపింది.



తూ గో జిల్లా.నల్లజర్ల మండలంలో  రేవ్ పార్టీ కలకలం రేపింది. 
 
 పచ్చదనంతో ఎప్పుడూ పాడిపంటల తో ఉండే తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఘంటవారిగూడెం లో రేవ్ పార్టీ  ఒక్కసారిగా కలకలం సృష్టించింది....

 పుట్టినరోజు సందర్భంగా ఘంటవారిగూడెంలో యువతులతో అస్లీల నృత్యాలు జరుగుతున్నాయని సమాచారం అందుకున్న కొవ్వూరు డిఎస్పి దేవకుమార్ ఆదేశాల మేరకు నల్లజర్ల సిఐ బాలసౌరి దేవరపల్లి సిఐ నాయక్ తమ సిబ్బందితో దాడి చేసి 25 మంది పురుషులను ముగ్గురు మహిళలను అరెస్ట్ చేశారు....

 వెస్ట్రన్ మొజులో పడి యువత పెడదారి పట్టి ఇటువంటి సంఘటనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ పి నరసింహ కిషోర్ తెలిపారు.... 

 ఈ దాడిలో 25 మంది పురుషులు ముగ్గురు మహిళలతో పాటు ఏడు కార్లు పదివేల రూపాయల నగదు మూడు విస్కీ బాటిల్స్ 20 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామని కొవ్వూరు డిఎస్పి దేవకుమార్ తెలియజేశారు.....

 గతంలో ఇదే గెస్ట్ హౌస్ లో ఇలాంటి కేసులు నమోదయ్యాయని తొందరలో గెస్ట్హసం సీజ్ చేస్తామని దేవకుమార్ తెలియజేశారు.

Post a Comment

Previous Post Next Post