ఉత్తమ సేవా పురస్కార గ్రహీతను సన్మానించిన కంభం మండల ఎం ఈవోలు.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి (దాసరి యోబు )
కంభం మండల తాసిల్దార్ వి .కిరణ్ ను ఎంఈవోలు, సిఆర్పిలు, మండల విద్యాశాఖ అధికారి షేక్ అబ్దుల్ సత్తార్. మరియు సిబ్బంది. బుధవారం ఘనంగా పూలమాల దుశాలలతో సన్మానించారు.
79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒంగోలులోరాష్ట్ర సాంఘిక సంక్షేమ, సచివాలయ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, మరియు ప్రకాశం ఎస్పీ ఏఆర్.దామోదర్ చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కార ప్రశంసాపత్రాన్ని,అందుకున్న సందర్భంగా,ఆయన సేవలను గుర్తుచేస్తూ,అభినందించారు. ఈ సందర్భంగా ఎంఈవోలు అబ్దుల్ సత్తార్.శ్రీనివాసులు మాట్లాడుతూ అధికారుల సేవలు వారి వ్యక్తిత్వానికి ప్రతీకలని ప్రసశించారు.
కార్యక్రమంలో సిఆర్పిలు మురళీమోహన్, రవీంద్రనాయక్, వై.శేఖర్, రామచంద్రుడు.మండల సమన్వయకర్త చిన్ని.పద్మావతి.తదితరులు పాల్గొన్నారు.
