ధర్మాజీ గూడెం ఎరువులు షాపులపై జాయింట్ యాక్షన్ కమిటీ తనిఖీలు.
ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీ గూడెం గ్రామంలో ఎరువులు షాపులపై జాయింట్ యాక్షన్ కమిటీ తనిఖీలు నిర్వహించారు.యూరియా మరియు ఎరువులు ఆక్రమణల నిలవలపై మరియు యూరియా ఎటువంటి బిల్లు లేకుండా రవాణా చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ హబీబ్ భాషా అన్నారు. యూరియా పక్కదారి పట్టిస్తే క్రిమినల్ కేసులు కూడా పెడతామని అన్నారు. ఈరోజు ధర్మాజీ గూడెం విలేజ్ లో ఎరువుల షాపులపై జెడి భాష, AD సుబ్బారావు,ఏవో ప్రదీప్ కుమార్, ధర్మాజీగూడెం సబ్ ఇన్స్పెక్టర్, K. వెంకన్న సంయుక్తంగా దాడులు నిర్వహించారు.
నానో యూరియా వాడకంపై రైతులకు అవగాహన కల్పించాలని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతానికి వరి పంటకు మాత్రమే యూరియా అందించాలని, ఉద్యాన శాఖ పంటలైన మొక్కజొన్న, పామాయిల్ పంటలకు ప్రస్తుతానికి యూరియా ఇవ్వద్దని జెడి తెలిపారు.
